19-04-2025 12:00:00 AM
నజ్లెన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘అలప్పుజ జింఖానా’. ప్రముఖ దర్శకుడు ఖలీద్ రెహమాన్ ఈ సినిమాను వైబ్స్, ఫైట్స్, ఫన్ బ్లెండ్‌తో తెరకెక్కించారు. ప్లాన్ బీ మోషన్ పిక్చర్స్, రీలిస్టిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల మలయాళం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు తెలుగులో కూడా సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది.
ఏప్రిల్ 25న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి డీవోపీ: జిమ్షి ఖలీద్; సంగీతం: విష్ణు విజయ్; సాహిత్యం: సుహైల్ కోయా; ఎడిటర్: నిషాద్ యూసుఫ్; ఆర్ట్: ఆషిక్ ఎస్; నిర్మాతలు: ఖలీద్ రెహమాన్, జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి; రచన: ఖలీద్ రెహమాన్, శ్రీని శశీంద్రన్; దర్శకత్వం: ఖలీద్ రెహమాన్.