calender_icon.png 23 October, 2024 | 2:09 AM

తూ.. కిత్తే!

07-08-2024 02:17:14 AM

ఉదయం ఎమ్మెల్యే.. సాయంత్రం మాజీ ఎమ్మెల్యే

తుమ్మిళ్ల ఎత్తిపోతల మోటర్ల స్విచ్ ఆన్

  1. నీటి విడుదలపై ఎమ్మెల్యే విజేయుడు.. మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మధ్య రగడ
  2. డెలివరీ పాయింట్ల వద్ద బైఠాయించిన ఎమ్మెల్యే విజేయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 

అలంపూర్ చాలా హాట్ గురూ..!

వనపర్తి, ఆగస్టు ౬ (విజయక్రాంతి)/ అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌కు చెందిన విజేయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మధ్య సాగునీటి విడుదల విషయంలో రగడ మొదలైంది.

సుంకేసుల జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో వడ్డెపల్లి మండలం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మోటర్లను ఆన్ చేసేందుకు అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌కు ఆహ్వానం పంపారు.

మంగళవారం ఉదయం ఎమ్మెల్యే విజేయుడు స్థానిక నాయకులతో కలిసి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం వద్ద మోటర్లను ఆన్‌చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అక్కడికి చేరుకుని మోటర్లను ఆఫ్ చేయించారు.

నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాడి ప్రాజెక్టు ఏర్పాటుకు తాను కృషి చేశానని గుర్తు చేస్తూ తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మోటర్లను ఎలా ఆన్ చేయిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మోటర్లను ఆఫ్ చేయించారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజేయుడు స్థానిక నాయకులతో కలిసి అక్కడికి చేరుకుని స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే విజేయుడుతో మాట్లాడారు.

ఆందోళన విరమిం చాలని కోరారు. అయినా ఆందోళన కొనసాగించడంతో అరెస్ట్ చేసి అక్కడి నుంచి తర లించారు. సాయంత్రం మాజీ ఎమ్మెల్యే సం పత్ కుమార్ అధికారులతో కలిసి మరోసారి మోటర్లను స్విచ్ ఆన్ చేయడం గమనార్హం. 

ఎమ్మెల్యేపై అధికారుల తీరు సరికాదు : కేటీఆర్

హైదరాబాద్, విజయక్రాంతి: ప్రభుత్వ అధికారులు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి పట్ల వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రజా పాలనలో ప్రజాప్రతినిధులకు ప్రతిరోజు అవమానాలే జరుగుతున్నాయని, ప్రజల చేతిలో తిరస్కరిం చబడిన కాంగ్రెస్ నాయకులను అధికార సమావేశాలకు, కార్యక్రమాల్లో ఎందుకు ఆహ్వానిస్తున్నారో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో ప్రజ ల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానించేందుకు ఈ ప్రభు త్వం ప్రొటోకాల్ విధానాలు పాటించడం లేదని మండిపడ్డారు.