calender_icon.png 15 January, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ స్తంభం విరిగిపడి బాలుడు మృతి.. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

26-08-2024 06:56:54 PM

అలంపూరు,(విజయక్రాంతి): అలంపూర్ పట్టణం సంగమేశ్వర కాలనీకి చెందిన తెలుగు చిన్న మద్దిలేటి, మానసల కుమారుడు మహేష్(5) ఆదివారం చెట్ల కొమ్మలు తొలగిస్తుండగా ఆ తీగలు బరువుకు విద్యుత్ స్తంభం మీద పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాధ్యత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందజేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి బాధిత కుటుంబానికి పరిహారం అందజేయాలని విద్యుత్ అధికారులతో మాట్లాడినట్టు నాయకులు తెలిపారు.