ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయ క్రాంతి): సీనియర్ ఐపీఎస్ అకున్ సబర్వాల్‌ను సొంత కేడర్ తెలంగాణకు పంపిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇండో టిబెటిన్ ఆఫ్ పోలీస్ ఐజీగా సేవలు అందిస్తున్న ఆయన్ను తిరిగి తెలంగాణను పంపిస్తూ కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
గురువారం తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లను కేంద్రం రిలీవ్ చేసింది. ఒకరోజు తర్వాత అకున్ సబర్వాల్‌ను రాష్ట్రానికి పంపించడం గమనార్హం. 2023లో అకున్ డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులోకి వెళ్లారు. ఆయన త్వరలోనే తెలంగాణకు రానున్నారు.