విష్ణు మంచు.. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లో మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. మోహన్‌లాల్, ప్రభాస్, మోహన్‌బాబు, శరత్‌కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి భారీ తారాగణం భాగమైన ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. అయితే, ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ టీమ్ ప్రతి సోమవారం ఒక అప్డేట్ ఇస్తోంది. అలా ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. చిత్రంలో శివుడిగా నటించిన బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ పాత్రకు సంబం ధించి ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు.
శివుడిగా అక్షయ్‌కుమార్ పాత్ర ఎలా ఉండబోతోందో ఈ ఒక్క పోస్టర్‌తోనే తెలుస్తోంది. ఇలాంటి ఓ అద్భుతమైన సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, శివుని ఆశీస్సులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నామంటూ అక్షయ్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.