calender_icon.png 24 October, 2024 | 7:54 PM

అక్షయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్!

13-07-2024 04:32:55 AM

అంబానీ వారింట పెళ్లంటే ప్రముఖులు చేసే సందడే వేరు! నూతన జంట అనంత్ ప్రీ వెడ్డింగ్‌లో టాలీవుడ్‌కు చెందిన రామ్‌చరణ్, మహేశ్‌బాబుతోపాటు బాలీవుడ్ నటులూ సందడి చేశారు. అయితే, సీనియర్ నటుడు అక్షయ్ కుమార్ మాత్రం డుమ్మా కొట్టారట. శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా, కొవిడ్ పాజిటివ్ అని తేలిందని సమాచారం. ఈ కారణంగానే ఆయన పెళ్లికి, తన తాజా చిత్రం ‘సర్ఫిరా’ ప్రమోషన్స్ కార్యక్రమానికి గైర్హాజరైనట్టు తెలుస్తోంది. అక్షయ్ కరోనా బారిన పడటం ఇది మూడో సారి.