calender_icon.png 6 April, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాకాళిలో అక్షయ్ ఖన్నా

06-04-2025 12:02:24 AM

యువ దర్శకుడు ప్రశాంత్‌వర్మ తన మూడో ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహాకాళి’. ఆర్‌కేడీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఇటీవల ‘ఛావా’ సినిమాలో తన పవర్‌ఫుల్ నటనతో ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా ఈ చిత్రంలో భాగమవుతున్నారు.

పౌరాణిక ఇతివృత్తంలో వస్తున్న ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా పాత్ర సరికొత్తగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలోని తారాగణం గురించి వెల్లడించడం ఇదే మొదటిసారి. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో విడుదల చేయనున్నారు.