calender_icon.png 1 November, 2024 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షర సూర్యుడు ‘ఏబీకే’

02-08-2024 02:00:18 AM

ఏబీకే ప్రసాద్ జీవన సాఫల్య అభినందన సభలో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగష్టు 1 (విజయక్రాంతి): జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కోసం శ్రమిస్తున్న అక్షర సూర్యుడు ఏబీకే ప్రసాద్ అని పలువురు వక్తలు అన్నారు. గురువారం ఆయన 90వ జన్మదినం సందర్భంగా.. వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జీవన సాఫల్య అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన ప్రధాన మంత్రి పూర్వ మీడియా సలహాదారు, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పూర్వసంపాదకుడు డా.సంజయ్‌బారు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రముఖ సంపాదకులు డా.కే రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్, విశాలాంధ్ర సంపాదకులు ఆర్‌వీ రామారావు, వయోధిక పాత్రకేయ సంఘం నాయకులు.. దాసు కేశవరావు, కే లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు సీనియర్ పాత్రికేయులు రాసిన వ్యాసాల సంపుటి ‘అలుపెరుగని అక్షరయోధుడు ఏబీకే’ అనే పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏబీకే ప్రసాద్ రచనలు జర్నలిజంతో పాటు సమాజాన్ని చైతన్యపరిచేవిగా ఉంటాయని కొనియాడారు. రాయలేని అనేక మందిని భుజం తట్టి జర్నలిజంలోకి నడిపించిన వ్యక్తి అని కొనియాడారు.  ఆంధ్రప్రభ, ఉదయం, ఆంధ్రజ్యోతి, సుప్రభాతం సహా అనేక పత్రికల్లో ఏబీకే పనిచేశారన్నారు.  ఈ సందర్భంగా ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు భాషకు గుర్తింపు తీసుకురావడానికి పీవీ నర్సింహారావు, డా.సంజయ్‌బారు కృషి చేశారన్నారు. తనను సత్కరించిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.