* చిన్నారులకు అక్షరాభ్యాస పూజల కోసం సర్వం సిద్ధం
* మంజీరా నదిలో గంగామాతకు పూజలు చేసేందుకు ఏర్పాట్లు
* మంజీరా నదిలో పుణ్య స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు
* సరస్వతి అమ్మవారి దర్శనం కోసం కర్ణాటక, తెలంగాణ ప్రజలు రాక
సంగారెడ్డి, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): పంచవటి సరస్వతి దేవి క్షేత్రం వసంత పంచమి మహోత్సవాలకు సిద్ధమైంది. న్యాల్కల్ మండలంలోని రాగాపూర్ గ్రామ శివారులో ఉన్న పంచవటి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలకు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. మంజీరా నది ఒడ్డున సరస్వతి దేవి దేవాలయం ఉండడంతో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం చేశారు.
సోమవారం సరస్వతి అమ్మవారి జయం తి పురస్కరించుకొని ఆలయంలో వేద పండితులు కుంకుమార్చన, అభిషేకం, సరస్వతి యాగం, హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. దేవాలయానికి సమీపంలో ఉన్న మంజీరా నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు ఏర్పాటు చేశారు.
పంచవటి క్షేత్రంలో సరస్వతి అమ్మవారితో పాటు, సాయిబాబా దేవాలయం, దత్తాత్రేయ స్వామి, దేవి భూదేవి సామేత వెంకటేశ్వర స్వామి, సూర్య భగవాన్, గంగామాతలను దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సరస్వతి దేవి దేవాలయంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించేందుకు వేద పండితులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.
అష్టదశ శక్తిపీఠాలను అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టాపన చేసేందుకు పీఠాధిపతి కాశీనాథ్ బాబా భారీగా ఏర్పాటు చేశారు. మంజీరా నదిలో గంగా మాతకు హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వసంత పంచమి వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఏర్పాట్లు చేస్తున్నారు.
మంజీరా నది ఒడ్డున ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు
రాఘవపూర్ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున పంచవటి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిం చేందుకు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. అక్షర శ్రీకర పూజల కోసం శుభ ముహూర్తాలు ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలు వచ్చే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
మంజీర నదిలో స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగామాతకు పూజలు చేసేందుకు భక్తులకు ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. సరస్వతి అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు విద్యుత్ దీపాలతో అలంకరణ ఏర్పాటు చేశారు. పంచవటి క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్ బాబా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
కర్ణాటకలోని బీదర్ జిల్లాకు సమీపంలో పంచవటి క్షేత్రం ఉండడంతో కర్ణాటక ప్రజల సైతం ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో వసంత పంచమి వేడుకలకు వస్తుంటారు. నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గం చెందిన ప్రజలు సరస్వతి దేవి అమ్మవారి దర్శనం కోసం వస్తారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.