calender_icon.png 14 November, 2024 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్క మహాదేవి గుహలు

13-11-2024 12:00:00 AM

 నాగర్ కర్నూల్ జిల్లాలో దట్టమైన నల్లమల అడవిలో ఉన్నాయి.  ఈ గుహలు శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్‌కు 18 కి.మీ దూరంలో ఉన్నాయి. తెలంగాణలో నదికి ఉత్తరం వైపున సహజంగా ఏర్పడిన గుహలు. కృష్ణా నదికి ఎగువన చాలా సమీపంలో ఉన్నాయి. ఈ గుహలను పడవల ద్వారా చేరుకోవచ్చు. ఈ గుహలకు మరొక పేరు స్వయంభూ శివ మందిరం. అక్కమహాదేవి గుహలు పర్యాటకులకు సాహసోపేతమైన థ్రిల్‌ను అందిస్తాయి.

అక్కమహాదేవి గుహ ప్రవేశద్వారం, గర్భగుడిని సందర్శించడానికి గుహలోకి సుమారు 150 మీటర్ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రవేశద్వారం వద్ద కపాల భైరవ, వీరభద్ర, మహిషాసుర మర్దిని, మధ్యయుగ కాలం నాటి అనేక మూర్తులు కనిపిస్తాయి. ఎన్నో ఏళ్ల కింద ఏర్పడిన గుహలు నేటికీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.