calender_icon.png 21 January, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంచరీతో కదం తొక్కిన అకిన్‌సన్

31-08-2024 12:00:00 AM

లండన్: సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించి ంది. మొదటిరోజు జో రూట్ సెంచరీతో కదం తొక్కగా.. రెండో రోజు ఆటలో లోయ ర్ ఆర్డర్‌లో అకిన్‌సన్ (115 బంతుల్లో 118) సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 427 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లంక తొలి ఇన్నింగ్స్‌లో 196 పరుగులకే కుప్పకూలడంతో ఇంగ్లండ్‌కు 231 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.. మెండిస్ (74) ఒంటరిపోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, అకిన్‌సన్, స్టోన్, పాట్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.