డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య, శోభితల వివాహం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున సప్రైజ్ ఇచ్చారు. తన చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం జరిగిందని మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అభిమానులంతా ఓ వైపు అఖిల్ కొత్త సినిమా కోసం ఎదురు చూస్తుంటే.. వారికి నాగ్ శుభవార్త చెప్పారు. అఖిల్‌కు కాబోయే భార్య పేరు జైనబ్ రవ్జీ. ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా. “జైనబ్‌తో మా కుమారుడి నిశ్చితార్థం జరిగిందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం. కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబోయే దంపతులకు మీ ఆశీస్సులు అందించండి” అని నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఫ్యాన్స్ అఖిల్ జంటకు కామెంట్స్ బాక్స్‌లో శుభాకాంక్షలు చెబుతున్నారు. మొత్తానికి అక్కినేని వారింట రెండు శుభకార్యాలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా, అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్యతోపాటే అఖిల్ పెళ్లి కూడా జరగనుందనే చర్చ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.