నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ‘-సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ తర్వాత నాలుగోసారి కలిసి పని చేయనున్నారు. వీరి కాంబోలో వచ్చిన ‘అఖండ’ విశేషంగా ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో మరోమారు ‘అఖండ 2 తాండవం’తో రానున్నారు. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించనున్న ఈ ‘బీబీ4’ అఖండ చిత్రానికి సీక్వెల్ కాగా.. ఇది బాలకృష్ణ, బోయపాటికి మేడిన్ పాన్ ఇండియా మూవీ కానుంది.
తొలిభాగంలో హీరోయిన్‌గా నటించిన ప్రగ్యా జైస్వాల్ సీక్వెల్‌లోనూ భాగం కానుంది. మొత్తం కోర్ టీమ్, పలువురు అతిథుల సమక్షంలో ‘అఖండ2’ బుధవారం ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు తేజస్విని కెమెరా స్విచాన్ చేయగా, బ్రాహ్మణి క్లాప్ కొట్టారు. ముహూర్తం షాట్‌కు బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు.
టైటిల్ థీమ్‌ను నందమూరి రామకృష్ణ ఆవిష్కరించారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభించ నున్నట్టు దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: థమన్ ఎస్; డీవోపీ: సి.రాంప్రసాద్, సంతోష్.డి డెటాకే; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి; ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు.