calender_icon.png 28 April, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం

28-04-2025 01:09:59 AM

సిర్గాపూర్, ఏప్రిల్ 27: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని ఉజలంపాడ్, చాప్టా శివారులోని శ్రీ సీమ హనుమాన్ మందిరం వార్షికోత్సవం, శ్రీ అఖండ హరినామ సప్తాహ ముగింపు కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం గోపాలకాల కీర్తన మహోత్సవం ఘనంగా జరిగింది. అంతర్గాం గజేంద్ర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ కాలా కీర్తన సేవా కార్యక్రమం నిర్వహించబడింది.

కాల కీర్తనలో భక్తులనుద్దేశించి శ్రీకృష్ణుని యొక్క లీలామృతం, ప్రవచనం చెప్పడం జరిగింది. సాంప్రదాయ భజన మండలి ఆధ్వర్యంలో కాలా కీర్తన మహత్యంపై భక్తి గీతాలను ఆలపిస్తూ వాటి తాత్పర్యాన్ని భక్తులకు వివరించారు.

ఈ ఉత్సవం వేడుకకు అశేష ప్రజానీకం తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసింది. అనంతరం మహా అన్న సంతర్పన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచ కృషి గ్రామాలు, ప్రజలు, శ్రీ సీమ హనుమాన్ ధార్మిక ఆధ్యాత్మిక సేవా సదన్ ట్రస్ట్ సభ్యులుపాల్గొన్నారు.