calender_icon.png 1 March, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అఖండ హరినామ సప్తాహ

01-03-2025 12:39:58 AM

పెద్ద  కోడప్గల్ ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్గల్  మండలం  కాటేపల్లి గ్రామంలో ఘనంగా గాథ పూజ అఖండ హరినామ సప్తాహలో భాగంగా ఏడవ రోజు శుక్రవారం గాథ పూజ ఘనంగా సప్తాహా అధ్యక్షులు విఠల్ మహారాజ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు శ్రీదేవి మల్లప్పపటేల్, సరోజ విజయ్ దేశాయ్ లు గాథ పూజ చేశారు.

ఏడు రోజులుగా సాగుతున్న అఖండ హరినామ సప్తాహా కార్యక్రమంలో ప్రతి రోజు గాథ భజన,ప్రవచనం,హరి పాఠ్,హరి కీర్తన,హరి జాగరణ,కాకడ హారతి కార్యక్రమాలు నిర్వహించారు.ప్రతి రోజు భక్తులకు అన్న ప్రసాదం అందించారు.ఈ కార్యక్రమాలకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు,భజన మండళ్లు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.