12-04-2025 06:03:10 PM
మహమ్మదాబాద్ (విజయక్రాంతి): మహమ్మదాబాద్ మండలం జూలపల్లి గ్రామంలో అఖండ భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. గడిచిన రాత్రి పూర్తిస్థాయిలో అఖండ భజన వేడుకల్లో రెడ్డిపల్లి విగ్నేశ్వర భజన కమిటీ సభ్యులు పాల్గొని భక్తిశ్రద్ధలతో అఖండ భజన చేశారు. భజన మండలి సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా శాలువా పూలమాలతో సన్మానించారు. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం శ్రీ వీరే వీరాంజనేయ స్వామి దేవాలయం చుట్టూ తీరు తేరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున పాల్గొని అంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక దర్శనాలు చేసుకుంటారు.