మలక్‌పేట, ఆగస్టు 26: ఏషియన్ కరాటే ఫెడరేషన్ కటా జడ్జి-ఏ గా నగరానికి చెందిన సయ్యద్ ఇఫ్తేకార్ హుస్సేన్ అర్హత సాధించారు. ఫిలిపిన్స్‌లోని మనీలాలో జరిగిన ఏషియన్ కరాటే ఫెడరేషన్(ఏకేఎఫ్) కటా జడ్జి ఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. గత ఏడాది కాటా జడ్జి-బి లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. రిఫ్రీ కమిషన్ చైర్మన్ మన్సూర్ అల్ సుల్తా న్, యూఏఈ రెఫ్రీ కమిషన్ చైర్మన్ జాబెర్ అల్ జబీ నేతృత్వంలో ఏకేఎఫ్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారన్నారు.