calender_icon.png 20 January, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాడమీ ఆదేశాలూ బేఖాతర్

25-07-2024 12:52:11 AM

ముస్సోరిలో రిపోర్ట్ చేయని పూజా ఖేద్కర్

ఆమె తల్లిదండ్రుల బంధంపై విచారణకు ఆదేశం

న్యూఢిల్లీ, జూలై 24: వివాదాస్పద ట్రైయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. తప్పుడు కుల, దివ్యాంగ ధ్రువపత్రాలు సమర్పించి ఐఏఎస్ ఉద్యోగం పొందినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మె.. యూపీఎస్సీ ఆదేశాలను బేఖాతర్ చేశారు. ఈమె వ్యవహారంపై విచారణకు కేం ద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఏకసభ్య క మిషన్‌ను నియమించిన విషయం తెలిసిం దే. ఆ కమిషన్ నివేదిక వచ్చేవరకు ఆమె ట్రె యినింగ్‌ను యూపీఎస్సీ నిలుపుదల చేసి ంది. ౨౩వ తేదీలోపు ముస్సోరీలోని అకాడెమీలో రిపోర్టు చేయా లని పూజను ఈ నెల ౧౬న ఆదేశించింది. కమిషన్ విధించిన గడువు ముగిసినా ఆమె రిపోర్టు చేయలేదు. ఆమెపై క్రిమినల్ చర్యలకు యూపీఎస్సీ సిద్ధమవుతున్నట్టు తెలిసింది.  

తల్లిదండ్రుల విడాకులూ ఫేకేనా?

ఆమె యూపీఎస్సీకి, అంతకుముందు కోచింగ్ తీసుకొంటున్న సమయంలో ఢిల్లీ లో వివిధ కోచింగ్ సెంటర్లకు ఇచ్చిన దరఖాస్తుల్లో తన తల్లిదండ్రులు విడిపోయారని, తనకు పైసా ఆదాయం లేదని పేర్కొన్నారు. కానీ, ఆమె తల్లిదండ్రులు ఇప్పటికీ ఒకే ఇంట్లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. పూజ తల్లిదండ్రులు దిలీప్, మనోరమ ౨౦౦౯లో పరస్పర అంగీకారంతో విడాకులకు కోర్టులో దరఖాస్తు చేసుకొన్నారు. వారికి ౨౦౧౦ జూన్ ౨౫న అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. వారు ఇప్పటికీ పుణెలోని బానేర్ ప్రాంతంలో ఉన్న బంగ్లాలో కలిసే ఉంటున్నట్టు తెలిసింది.