హైదరాబాద్, జనవరి 29(విజయక్రాంతి): గోదావరి రివర్ మేనే జ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్‌గా ఎకే ప్రధాన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా ఉన్న ముకేష్ కుమార్ సిన్హాను కేంద్ర జల వనరు ల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌గా నియమిస్తూ ఈ నెల 13న కేంద్రం నిర్ణయం తీసుకుంది.
సీడబ్ల్యూసీ చైర్మన్‌గా ఉన్న కుశ్విందర్ ఓహ్రా పదవీ విరమణ చేశాక.. గత ఏడాది అక్టోబర్ లో కేంద్ర జల్‌శక్తి అదనపు కార్యదర్శి రమేష్ కుమార్ వర్మను మూడు నెలల పదవీ కాలం కోసం తాత్కాలిక చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. వర్మ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఎంకే సిన్హాకు సీడబ్ల్యూసీ చైర్మన్‌గా పదోన్నతి కల్పించింది.
అయితే జీఆర్‌ఎంబీలో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఇంజనీర్లను, మహిళా ఉద్యోగులను బోర్డు సభ్య కార్యదర్శి పలు రకాలుగా వేధిస్తున్నారని ఇటీవల సీడబ్ల్యూసీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది. జీఆర్‌ఎంబీ చైర్మన్ పదవిని భర్తీ చేయడంతో ఈ వేధింపులు తగ్గుతాయని బోర్డులో పనిచేస్తున్న తెలంగాణ ఇంజనీర్లు భావిస్తున్నారు.