కోలీవుడ్‌లో స్టార్ హీరో అజిత్‌కుమార్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోంది. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ వచ్చింది. తాజాగా గురువారం సెకండ్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో అజిత్‌కుమార్ లుక్ ఆసక్తికరంగా ఉంది.
అజిత్ బ్లాక్ షేడ్స్ ధరించి ప్రిజనర్ యూనిఫాంలో ఎలక్ట్రిఫైయింగ్ న్యూ అవతార్‌లో కనిపించారు. అజిత్ చేతిపై ఉన్న టాటూ, బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యాసీవ్ గన్ ఫైరింగ్ స్టన్నింగ్ ఉన్నాయి. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి డీవోపీ: అభినందన్ రామానుజం; స్టంట్స్: సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్; ఎడిటర్: విజయ్ వేలుకుట్టి; ప్రొడక్షన్ డిజైనర్: జీఎం శేఖర్.