calender_icon.png 24 December, 2024 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునుపెన్నడూ కనిపించని లుక్‌లో అజయ్

15-10-2024 12:00:00 AM

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ’పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కు తోంది. ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో అజయ్ నటిస్తున్నారు. ఇప్పటి వర కూ ఆయన అలాంటి క్యారెక్టర్‌లో నటించింది లేదని మేకర్స్ చెబుతున్నారు.

సోమవారం ఈ సినిమా నుంచి అజయ్ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రెండు వేట కుక్కలను చైన్స్‌తో కంట్రోల్ చేస్తున్న రగ్గడ్‌గా అజయ్ కనిపిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్ , ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ బ్యానర్లపై నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. పొట్టేల్ చిత్రం అక్టోబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రియాంక శర్మ, తపస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర కీలక పాత్రలు పోషిస్తున్నారు.