- 45 గంటలపాటు సాగిన గాలింపు
- చికిత్సపొందుతూ గణపతి మృతి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 28(విజయక్రాంతి): హుస్సేన్‌సాగర్ వద్ద జరిగిన బోటు ప్రమాదంలో బాణసంచా పేలిన సంఘటనలో గల్లంతైన బీటెక్ విద్యార్థి అజయ్(21) మృతదేహంఎట్టకేలకు మంగళవారం లభ్యమైంది. అతని ఆచూకీ కోసం సోమవారం ఉదయం ప్రారంభమైన గాలింపు చర్యలు దాదాపు 45గంటల పాటు కొనసాగాయి.
ఈ గాలింపు చర్యల్లో ఫైర్, లేక్ పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ విభాగాలకు చెందిన దాదాపు 50మంది సిబ్బంది పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్‌లో అజయ్ గల్లంతైనట్లు భావిస్తున్న ప్రదేశంలో ఎక్కువగా బురద ఉండే అవకాశం ఉన్నందున మంగళవారం మరో పద్దతిలో భాగంగా బోట్లతో అలలను సృష్టించారు.
ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అజయ్ మృతదేహం లభ్యం అయ్యింది.కాగా ఓ ఆర్థిక లావాదేవి విషయమై అజయ్ ఫ్రెండ్స్‌తో కలిసి మహాహారతి కార్యక్రమానికి వెళ్లినట్లు సమాచారం.
చికిత్స పొందుతూ గణపతి మృతి..
ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గణపతి మంగళవారం మృతి చెందాడు. గణపతిది ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరిజిల్లా అని తెలుస్తోంది.