calender_icon.png 25 December, 2024 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యారే దండారీ.. అదిరెన్ ‘గుస్సాడీ’!

02-11-2024 02:41:16 AM

ఆదిలాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): దీపావళి సందర్భంగా ఆదివాసీలు నియమనిష్ఠలతో దండారీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడెంలో ఘనంగా దండారీ ఉత్సవాలు జరిగాయి. కలెక్టర్ రాజరి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్లు దీపక్ తివారీ, అజ్మీరా సంకేత్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు.

ఆదివాసీలతో కలిసి కోలాటమాడుతూ సందడి చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్ దండారీ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఇదే రూరల్ మండలం అంకాపూర్, చిన్న మాలే బోరిగం గ్రామాల్లో జరిగిన ఉత్సవాల్లో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి వారు గుస్సాడీ నృత్యం చేశారు.