13-03-2025 10:33:18 PM
భద్రాద్రి,(విజయక్రాంతి): సింగరేణి ఏరియా వీకేఓసిని ప్రైవేట్ వారికి అప్పగిస్తే ఉద్యమం చేపడతామని, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి,జి ఎం శాలేం రాజు కు మెమొరాండం అందించారు. బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జునరావు అధ్యక్షతన సమావేశం జరుగగా, ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ... కొత్తగూడెం వీకేఓసిలో బొగ్గు వెలికి తీసే పనిని ప్రైవేటువారికి అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికే సంస్థకు రావాల్సిన 35వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నీ నిర్వీర్యం చేస్తుందన్నారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ మీద అనేక ఉద్యమాలు చేస్తున్న సంఘం ఏఐటీయూసీ అని రాష్ట్ర ప్రభుత్వం మరియు యాజమాన్యం ప్రైవేటీకరణ కు ముందుకు పోతే సహించేది లేదని, ప్రైవేటీకరణ ను అడ్డుకోవడానికి తమ యూనియన్ సిద్ధంగా ఉన్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి వంగా వెంకట్ , కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరాస్వామి, కార్పోరేట్ కార్యదర్శి రమణమూర్తి, ఆఫీస్ బేరర్ లు పిట్ సెక్రటరీ లు ,కార్మికులు పాల్గొన్నారు.