28-04-2025 08:25:18 PM
ఎన్నికల హమీలు నేరవేరుస్తాం..
గేట్ మీటింగ్ లో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య..
టేకులపల్లి (విజయక్రాంతి): ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునియన్(Singareni Collieries Workers Union) ఆధ్వర్యంలో కొయగూడెం ఓసిలో సోమవారం ఉదయం షిఫ్ట్ లో గేట్ మీటింగ్ నిర్వహించారు. తొలుత కాశ్మీర్ పహల్లాగాం జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు అసువులు బాసిన అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో యునియన్ కార్యక్రమాలకు ఆకర్షితులైన ముగ్గురు జనరల్ మజ్దుర్లు యూనియన్ లో చెరారు. వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వనించారు.
ఈ సందర్భంగా కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్ లు మాట్లాడుతూ.. సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హమీలను నేరవేర్చే దిశగా యునియన్ పనిచేస్తుందని వారు అన్నారు.
ఈమధ్య కాలంలో డైరెక్టర్, చైర్మన్ స్థాయిలో జరిగిన సమావేశంలో పెట్టిన డిమాండ్లు వారి దృష్టికి తీసుకెళ్లగ వాటిని పరిష్కరిస్తు నేడు జనరల్ మజ్దుర్లను జనరల్ అసిస్టెంట్ లుగా మార్చి ఉత్తర్వులు జారీచేసారని, సింగరేణిలో మొట్టమొదటి సారిగా 1998లొ ఎఐటియుసి గుర్తింపు సంఘంగా ఎన్నికైనప్పుడు సింగరేణి కార్మికుల పిల్లలకు మెరిటి స్కాలర్ షిప్ పథకాన్ని ప్రవేశ పెట్టించడం జరిగిందని అప్పుడు కేవలం 2000 లొపు ర్యాంక్ సాధించిన ఉద్యోగుల పిల్లలకు మాత్రమే దీనిని వర్తించే విధంగా ఉండేదని 6000 స్కాలర్ షిప్ ఇచ్చారు 2010 లొ సవరిస్తు 10000 వేలుగా ఇస్తున్నారు ఎఐటియుసి విన్నపం మేరకు 2000 ర్యాంక్ నుంచి 8000 ర్యాంక్ వరకు పెంచి 10000వెల నుంచి16000 వెలకు పెంచడం జరిగిందని దానిని యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసిందని వారు అన్నారు.
కొయగూడెం ఓసిలొ పనిచేస్తున్న కార్మికులకు అనేక టైమ్ రెటేడ్ ప్రమోషన్లు ఇప్పిచ్చిన ఘనత ఎఐటియుసి దని బస్సు సౌకర్యం, మెరుగైన క్యాంటీన్ సౌకర్యం కల్పించడం జరిగిందని అది కేవలం ఎఐటియుసి వల్లనే వచ్చాయని వారు అన్నారు ఈ మధ్య కాలంలో వచ్చిన ఉత్తర్వులు మేమే సాదించామని మా ప్రభుత్వం ఇచ్చిందని కల్లబొల్లి మాటలను మాట్లుడుతున్న ప్రాతినిధ్య సంఘం తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని హితవు పలికారు జేకెఓసి ఎక్స్టేన్షన్ తెచ్చామని గొప్పలు చెప్పుకొచ్చారు కాని జేకెఓసి ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారని చెప్పాలి రెండు నెలల కంటే ఎక్కువగా నడవని దాని గురించి గొప్పలు చెప్పారు కాని ప్రక్కనే రాబోతున్న నూతన ఓసి బొగ్గు ప్రైవేటీకరణ గురించి మాట్లాడరమని ప్రభుత్వం మీదే ఉమ్మడి జిల్లాలకు ముగ్గురు మంత్రులు ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్లి బొగ్గు ప్రైవేటీకరణ ఆపండి ఈపి ఆపరేటర్లు ఎక్కడికి పొరు ఇక్కడే పనిచేస్తారు అని ప్రగల్భాలు పలికారే జేకెఓసి లో మణుగూరుకు వేల్లే వారు ఉంటే 20 మందిని అప్లికేషన్ పెట్టుకొమని యాజమాన్యం నోటిస్ బోర్డు వేసింది దినికి మీ సమాదానం ఏంటి అని దుయ్యబట్టారు నూతన ఓసి బొగ్గు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎఐటియుసి పొరాటాలు రుపకల్పన చేస్తోందని అన్నారు.
కలిసి వచ్చే సంఘాలతో ఐక్య కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముందుకు సాగుతామని వారు అన్నారు. ఈ సమావేశంలో బ్రాంచ్ ఉపాద్యక్షులు దాసరి రాజారాం, బ్రాంచ్ సహయ కార్యదర్శి కొంగర వేంకటేశ్వర్లు, ఫిట్ సహయ కార్యదర్శి బానొత్ బాలాజీ, షిఫ్ట్ ఇంచార్జిలు జిఏ శ్రీనివాస్, సామల శ్రీనివాస్, షబ్బీర్, కనకరాజు, బాలుకుమార్, హరిలాల్, సంపత్, ఇర్పా వెంకటేష్, వెంకటనర్సయ్య, శ్యామ్ సుందర్, శ్రీనివాస్, ఉమామహేశ్వర రావు, రాజ్ కుమార్, షేక్ వలి, తదితరులు పాల్గొన్నారు.