ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండి యూసుఫ్ ఎస్. బాల్ రాజ్
యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయుటకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని, అందుకోసం కార్మికుల పక్షాన నిరంతరం రాజీలేని పోరాటం చేస్తామని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండి. యూసుఫ్, ఎస్ బాల్ రాజు అన్నారు. ఎఐటియుసి యాదాద్రి భువనగిరి జిల్లా నిర్మాణ విస్తృత కౌన్సిల్ సమావేశం స్థానిక బైపాస్ రోడ్ లోని వివేరా హోటల్ లో జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఏండి. యూసుఫ్, ఎస్. బాల్ రాజ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... దేశానికి స్వతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ పెట్టుబడిదారి విధానం ఇంకా కొనసాగుతుందని, కార్మిక వర్గం దిశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు 29 చట్టాలను సమూలంగా రద్దుచేసి పెట్టుబడుదాలకు అనుకూలంగా 4 కోడ్ లను కేంద్ర ప్రభుత్వం మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెన్షన్ చట్టాలను అమలు చేయాలని, మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు 10వేలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో, హమాలీ ట్రాన్స్ పోర్ట్ రంగాల కార్మికులకు సమగ్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవ శత్తు మరణిస్తే 10 లక్షలు, సహజ మరణానికి 5 లక్షలు చెల్లించాలని, 60 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ 5 వేలు ఇవ్వాలని, సింగరేణి కాంటాక్ట్ కార్మికులను ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను పర్మనెంట్ చేయాలని సింగరేణిలో గుర్తింపు పత్రం ఇవ్వాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగుల సిసిఎస్ డబ్బులను వెంటనే చెల్లించాలని, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ, ఆశ కార్మికులకు 26,000 కనీస వేతనం చెల్లించాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని బ్యాంకులను కుదించారదని, గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ విధానాన్ని సవరించి పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని,అన్ని రకాల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని,ఉపాధి హామీ కార్మికులకు 200 రోజుల పని దినాలు కల్పించి రోజుకు 600 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి గోరేటి రాములు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేష్, బిసి హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి ఏశాల అశోక్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శులు గనబోయిన వెంకటేష్, గొరిగే నర్సింహా, గోపగాని రాజు, బీరకాయల మల్లేష్, సోమన్న సబిత, జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, దాసరి లక్ష్మయ్య, నాయకులు పల్లె శ్రీనివాస్, బాగుల వసంత, ముంతాజ్ బేగం, జిన్న రాజమణి, సంధ్య, చిలివేరు అంజయ్య, మూల పోచయ్య, ఎర్ర సిమోన్, కాసరబోయిన సత్తయ్య, జిన్న నర్సింహా, ఎండీ షరీఫ్, కొత్త కృష్ణ, మర్రిపల్లి సాయి, తుమ్మల ఇస్తారీ, పుట్ట రమేష్, చింతల మల్లేష్, దుద్దురి రాజు తోట రాములు తదితరులు పాల్గొన్నారు.