calender_icon.png 1 November, 2024 | 4:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

01-11-2024 02:19:46 PM

మంచిర్యాల, విజయ క్రాంతి : ఏఐటియుసి 105 వ ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న జెండాను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక ఉద్యమాలకు దిక్సూచి ఏఐటీయూసీ అని అన్నారు. 1920 అక్టోబర్ 31న ముంబై మహానగరంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) స్థాపించబడి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ దేశ స్వాతంత్ర పోరాటంలోనూ అనేక సంస్థల్లో జరిగిన పోరాటంలోనూ కార్మిక లోకాన్ని ఏకం చేసి కదిలించిందన్నారు.

వందేళ్ళ సుధీర్గ పోరాటంలో శ్రామిక, కార్మిక వర్గానికి ఏఐటియుసి భరోసాగా నిలిచిందని, కార్మికుల పక్షాన ఏఐటీయూసీ చేపట్టిన పోరాట ఉద్యమాలతోనే అనేక హక్కులు సాధించబడ్డాయన్నారు. కార్మిక శ్రేయస్సు కోసం, స్వాతంత్ర్యం కోసం వీరోచిత పోరాటాలు సాగించిన చరిత్ర ఏఐటియుసికి మాత్రమే ఉందని. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని పిలుపు నిచ్చింది, కార్మికుల హక్కుల సాధనకు అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన సంఘం ఏఐటీయూసీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైల్వే, పోస్టల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ బ్యాంకు, రక్షణ తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు  ప్రైవేటు పరం అయ్యాయని, పాలకుల తీరుతో పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారన్నారు.

ఎన్నో త్యాగాలతో, పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ చట్టాలను కాపాడుకునేందుకు కార్మికులు ఏఐటియూసి నాయకత్వంలో పోరాటాలు చేపట్టాలన్నారు. కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, అసంఘటిత కార్మికుల భద్రత, సామాజిక న్యాయం కోసం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడుతూ  పాలకులు  అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఖలిందర్ ఆలీ ఖాన్, రామన్న, మహేష్, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాయమల్లు, మధు, నర్సయ్య, క్రాంతి, శంకరమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.