calender_icon.png 17 October, 2024 | 3:24 PM

గనులపై ఎఐటియుసి ధర్నా

17-10-2024 01:13:04 PM

ఏకపక్ష సర్కులర్ కు నిరసన

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్ లలో విధులు నిర్వహిస్తున్న సింగరేణి  కార్మికులు వరుసగా 3 రోజులు డ్యూటీ కి రాకుండా గైర్హాజరు అయిన కార్మికులను ఆలో స్లిప్ కోసం జనరల్ మేనేజర్ అనుమతి తీసుకోవాలని ఏకపక్షంగా ఇచ్చిన సర్క్యులర్ ను నిరసిస్తూ గుర్తింపు సంఘం ఎఐటియుసి ఆధ్వర్యంలో గనులు డిపార్ట్మెంట్ లపై ధర్నా నిర్వహించారు. గురువారం ఏరియాలోని కేకే 5, కాసిపేట గనులు, ఏరియా వర్క్ షాప్ లపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షులు భీమనాదుని సుదర్శన్ లు మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం ఏకపక్షంగా సర్క్యులర్ జారీ చేసి కార్మికులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంది శ్రీనివాస్, సోమిశెట్టి రాజేశం, పెద్దపెల్లి బానయ్య, టేకుమట్ల తిరుపతి, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ లు ములకలపల్లి వెంకటేశ్వర్లు, తోట వెంకటస్వామి పిట్ కార్యదర్షులు గాండ్ల సంపత్, సిహెచ్ పి శర్మ, నాయకులు రామ్ లాల్,  బ్రహ్మారెడ్డి, అజయ్, మస్క భూమయ్య, పారిపెళ్లి రాజేశంలు పాల్గొన్నారు.