ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ నాయకులు మంత్రి సీతక్క(Minister Sitakka)కు వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రిమ్స్(RIMS) కు వచ్చిన మంత్రిని ఏఐటీయూసీ(AITUC) జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ ఆధ్వర్యంలో కార్మికులను కలిసి రిమ్స్ ఆసుపత్రి, సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి, ఉట్నూర్, నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల కార్మికులు ఎదురుకుంటున్న సమస్యలు వివరించారు. ఆసుపత్రులలో అవుట్ పేషంట్ల సంఖ్య పెరిగిందని, బెడ్స్ పెరిగాయి కానీ కార్మికులను పెంచడం లేదన్నారు. కాబట్టి ఈ సమస్యపై దృష్టి సారించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కార్మికుల సంఖ్యను పెంపోందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయిస్ అండ్ కార్మికుల యూనియన్ నాయకులు కన్నాల లక్ష్మి, నర్సమ్మ తదితరులు ఉన్నారు.