calender_icon.png 19 April, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ, పట్టణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న అయిత పరంజ్యోతి

19-04-2025 06:16:11 PM

క్రీడాకారులకు షటిల్ బ్యాట్స్, షటిల్ నెట్, షటిల్ కాక్స్ అందజేసిన అయిత పరంజ్యోతి..

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో గల ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి, యువకులకు షటిల్ బ్యాట్స్, నెట్, కాక్స్ అందజేసి ప్రోత్సహించినారు. అయిత పరంజ్యోతి మార్చి 27 తన పుట్టినరోజు నాడు విష్ణు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మాకు షటిల్ బ్యాట్స్, నెట్, కాక్స్ ఇవ్వగలరని కోరగా, సరే అని మాట ఇచ్చినారు. తన మాట ప్రకారం విష్ణు అండ్ ఫ్రెండ్స్ కి షటిల్ బ్యాట్స్, నెట్ కాక్స్ అందజేసినారు. విష్ణు ఫ్రెండ్స్ అయిత పరంజ్యోతికి శాలువా కప్పి సన్మానించినారు.

ఈ సందర్బంగా విష్ణు మాట్లాడుతూ... మేము అడిగిన వెంటనే కాదనకుండా మాకు అందజేసినందుకు అయిత పరంజ్యోతి అన్నకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పరంజ్యోతి అందరితో కలిసి షటిల్ గేమ్ అందరితో ఆడినారు. ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి, టైలర్ శ్రీను, ఆవుసుల కృష్ణ, సిద్దిరాములు, మనోహర్, న్యాలపల్లి సతీష్, విష్ణు, ప్రశాంత్ కుమార్, ప్రవీణ్ కుమార్, ప్రకాష్, రాజు, సురేష్, నరేష్, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.