26-02-2025 06:37:30 PM
చర్ల (విజయక్రాంతి): మహా శివరాత్రి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఐశ్వర్య మహిళా శక్తి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి విద్యానికేతన్ తేగడ వారి సహకారంతో ఉచితంగా తాగునీరు, రాగి జావ, మజ్జిగ, పానకం, పులిహోర భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తేగడ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి మాట్లాడుతూ... ఐశ్వర్య మహిళా శక్తి ఆధ్వర్యంలో భక్తులకు సేవలందించడం చాలా అభినందనీయమని, మహిళలు సేవా కార్యక్రమాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.
భవిష్యత్తులో ఐశ్వర్య మహిళా శక్తి మరింత బలోపేతమై సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు అలవాల పార్వతి, అధ్యక్షురాలు మద్ది లక్ష్మీబాయి, కార్యదర్శి సంగీతలక్ష్మి, ఉపాధ్యక్షురాలు నాగమణి కార్యవర్గ సభ్యులు స్వప్న సౌజన్య స్వరూప జ్యోతి కుమారి, ఐశ్వర్య మహిళా శక్తి సభ్యులు తేగడ గ్రామ పంచాయతీ కార్యదర్శి హర్షిని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, శ్రీ సరస్వతి విద్యానికేతన్ హెచ్ఎం లిఖిత, గ్రామ పెద్దలు వీర వెంకట కుమార రాజా, కండ్రపు చిట్టిబాబు, సావిత్రి, సంజీవ రెడ్డి, మురళి, సామి రెడ్డి నరసింహారెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు.