calender_icon.png 1 February, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏఐఎస్‌ఎఫ్ పోరాడాలి...

28-01-2025 11:33:02 PM

2025 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ..

విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏఐఎస్‌ఎఫ్ పోరాడాలని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ముద్రించిన 2025 సంవత్సర డైరీని హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని విద్యా కమిషన్ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో పలు సమస్యలపై ఆయన ఏఐఎస్‌ఎఫ్ నాయకులతో చర్చించారు. విద్యారంగంపై సూచనలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, చారగొండ వెంకటేశ్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మన్, రాష్ట్ర ఆఫీస్ బేరర్ బానోత్ రఘురాం, గ్యార క్రాంతి, నరేష్, రెహమాన్, కాసోజు నాగజ్యోతి, రాజు, లెనిన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చైతన్య తదితరులు పాల్గొన్నారు.