సూర్యాపేట, జనవరి 31 : ఈనెల 9, 10 వ తారీఖులలో హైదరాబాదులో జరిగే ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సమావేశాలకు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో తరలి వెళ్లి జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గోపగాని రవికుమార్ తెలిపారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్స్ రోడ్ లో జాతీయ సమితి సమావేశాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో పీజుల నియంత్రణ చట్టం అమలు కావడం లేదని, ఇలాంటి అనేక సమస్యల మీద జాతీయ సమితి సమావేశంలో చర్చించడం జరుగుతుందని,
అందువల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో ఈ సమితి సమావేశాలకు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు రాజేష్ నవీన్ మహేష్ రాజు వినయ్ రవి తదితరులు పాల్గొన్నారు.