calender_icon.png 20 April, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్

12-08-2024 04:58:17 PM

కరీంనగర్: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని కమాన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఏఐఎస్ఎఫ్ జెండాను ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు వల్లి ఉల్లా ఖాద్రి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వలి ఉల్లా  ఖాద్రి మాట్లాడుతూ... స్వాతంత్ర్యం రాక పూర్వమే దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, ఆజాద్ లు ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బాబుద్దీన్ బాస్, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల నాయకత్వాన ఆగస్టు 12, 1936 తేదీన ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని ఆయన తెలిపారు.

తెలంగాణ రైతాంగ పోరాటం, 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు ఉద్యమం, మలిదశ తెలంగాణ పోరాటం, హాస్టళ్ల సమస్యలు, విద్య వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న పాలకులపై అలుపెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో విజయాలు సాధించింది AISF అని వలి ఉల్లా  ఖాద్రి పేర్కొన్నారు. శాస్త్రీయ సోషలిజం తన గమ్యంగా, ప్రభుత్వ విద్యను, సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం తన కర్తవ్యమని, సమరశీల విద్యార్థి ఉద్యమాల నిర్మాణంలో నిమగ్నమైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) అని అన్నారు.