calender_icon.png 26 October, 2024 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య శాఖను గాలికి వదిలేశారు: ఏఐఎస్ఎఫ్ పిలుపు

26-10-2024 01:19:59 PM

హైదరాబాద్: ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ చలో సచివాలయం ముట్టడికి పిలునిచ్చింది. స్కాలర్ షిప్ లు , పీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు విడుదలకు డిమాండ్ చేసింది. పది నెలల కాలం లో విద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆందోళనకారులు తెలిపారు. అటు సచివాలయం ముట్టడికి యత్నించిన నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచెలు తొలగించామని  ప్రభుత్వం  చెప్పింది.. కానీ ఇవాళ పోలీస్ లు ఎక్కడికికి అక్కడ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజ్  రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో కాలేజీలు మూసి వేస్తున్నారని వాపోయారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న.. విద్య శాఖ మీ దగ్గరే ఉంది ఎందుకు ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి విద్య శాఖపై దృష్టి పెట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు.