calender_icon.png 9 October, 2024 | 2:45 AM

టాటా ప్లే కొనుగోలుకు ఎయిర్‌టెల్ చర్చలు!

09-10-2024 12:53:43 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: టాటా గ్రూప్ డీటీహెచ్ కంపెనీ టాటా ప్లేను కొనుగోలు చేసేందుకు భారతి ఎయిర్‌టెల్ టాటాలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డిజిటల్ టీవీ స్పేస్‌లో తన ఉనికిని పెంచుకునేందుకు, బండిల్డ్ సర్వీసుల్ని పటిష్ఠవంతం చేసి నాన్ ఆదాయాన్ని పెంచుకునేందుకు టాటా ప్లేను టేకోవర్ చేయాలని ఎయిర్‌టెల్ భావిస్తున్నట్లు సమాచారం.

అలాగే కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ వెంచర్ల నుంచి వైదొలిగే క్రమంలో టాటా గ్రూప్ ఈ డీటీహెచ్ కంపెనీని విక్ర యించాలని చూస్తున్న ది. టాటా ప్లేలో టాటా సన్స్‌కు 70 శాతం వాటా ఉన్నది. మిగిలిన 30 శాతం వాల్ట్ డిస్నీ చేతిలో ఉన్నది. టీవీ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం నుంచి వైదొలిగేందుకు వాల్ట్ డిస్నీ కూడా చూస్తున్నది.