calender_icon.png 12 March, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'స్పేస్ ఎక్స్'తో జట్టు కట్టిన ఎయిర్‌టెల్

11-03-2025 11:41:40 PM

ఇక మీదట ఇండియాలో స్టార్‌లింక్ ద్వారా ఇంటర్నెట్

న్యూఢిల్లీ: ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌తో భారతీ ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్‌ను అందించేందుకు ఎయిర్‌టెల్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో స్టార్ లింక్ అనుమతులకు లోబడే ఈ ఒప్పందం ఉంటుందని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌టెల్ ఎండీ, వైస్ చైర్మన్ గోపాల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘ఎయిర్‌టెల్ కస్టమర్లకు స్టార్ లింక్ సేవలను అందించేందుకు స్పేస్‌ఎక్స్‌తో జట్టుకట్టాం. ఇదో అద్భుతమైన అవకాశం. అత్యాధునిక శాటిలైట్ కనెక్టివిటీని అందించేందుకు కంపెనీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది’ అని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్‌లలో స్టార్ లింక్ పరికరాలు అందుబాటులో ఉండనున్నాయి. స్టార్ లింక్‌తో లింకప్ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.