calender_icon.png 5 April, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్

04-04-2025 12:00:00 AM

  • ఏర్పాటుకు భారత వాయిసేన గ్రీన్ సిగ్నల్

ప్రజల ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల త్వరలో సహకారం

ఆదిలాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తు న్న విమానాశ్రయం ఏర్పాటుపై భారత వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు అనుమతులిస్తూ భారత వాయుసేన ఉత్తర్వులు జారీ చేసినట్లు తాజాగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించడంతో జిల్లా వాసులు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌కు ఎయిర్ పోర్ట్ తీసుకువస్తా అని ప్రకటించిన కొన్ని రోజుల్లోనే కేంద్రం నుంచి అనుమతులు లభించడంతో త్వరలోనే ఆదిలాబాద్ గగనతలంలో గాలిమోటర్ ఎగుతుతోందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణకు ముఖద్వారం గా ఉన్న  ఆదిలాబాద్ పట్టణంలోని 362 ఎకరాలతో విస్తరించి ఉన్న విమానాశ్రయం మైదానంలో నిజాం కాలంలో విమానాల రాకపోకలు సాగేవని. అనంతరం ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటు మరుగునపడింది. దింతో మరోసారి విమానాశ్రయం ఏర్పాటుపై కొన్నేళ్లుగా ఉద్యమం సాగుతూ వచ్చింది. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రభు త్వం ఇటీవల కేంద్రానికి ఉత్తరాలు రాసింది. 

నెరవేరనున్న జిల్లా వాసుల కల...

ఎయిర్ పోర్ట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జిల్లా వాసుల కల త్వరలో నెరవేర నుంది. ఇక్కడ విమానాశ్రయ ఏర్పాటుకు పలుమార్లు వాయుసేన అధికారులు ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చి పరిశీలించిన ఘటనలు సైతం ఉన్నాయి.  ఇదే క్తమంలో 2013- లో విమానాశ్రయానికి ఈ ప్రాంతం అనుకూ లం ఉందా..? పైలెట్ల శిక్షణకు అనువుగా అవకాశం ఉందా ..? అనే అంశంలపై సర్వే జరిపారి.

ప్రస్తుతం ఉన్న 362 ఎకరాలతో పాటు విమానాశ్రయం ఏర్పాటు చేయడంతో అదనంగా మరో 1502 ఎకరాల భూమి అవసర మని ప్రభుత్వం సమగ్ర నివేదిక కేంద్రానికి పంపింది. ఆదిలాబాద్ రూరల్ మండలంలో ని కచకంటి, ఖానాపూర్, అనుకుంట, తంతోలి గ్రామాల పరిధిలోకి వచ్చే భూములను సర్వే చేసిన రెవెన్యూ శాఖ సమగ్ర నివేదికను 2014 లో హైదరాబాద్ బేగంపేట్‌లోని ఎయిర్ పోర్ట్  కార్యాలయానికి నివేదిక సైతం సమర్పించింది.

అప్పట్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటుకు ఎన్‌ఓసీ ఇవ్వకుండా అడ్డుకుంటుందని విమర్శులు ఉన్నాయి.ఇటీవల కొత్త విమానాశ్రయాల  ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపగా, ఇటీవలె వరంగల్ జిల్లా మామూర్ విమానాశ్రయ ఏర్పాటుకు పూర్తి అనుమతులు సాధించింది. దీంతో ఆదిలాబా ద్ జిల్లాకు సైతం అనుమతులు ఇవ్వాలంటూ జిల్లా ప్రజల నుంచి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే లపై ఒత్తిడి పెరిగింది.

దీనికి తోడుగా తర్వాత ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ లో ప్రకటించారు. అదేవిధంగా ఇటీవల జిల్లా నుండి బీజేపీ నుండి గెలిచిన ఎంపీ గోడం నగేశ్, ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యే సైతం కేంద్ర పౌర విమానశాఖ మంత్రి రాం మోహన్ నాయిడును కలిసి ఎయిర్ పోర్ట్  ఏర్పాటుపై విన్నవించారు. 

ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్  ఏర్పడితే ఉమ్మడి జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారా ష్ట్ర, చత్తీస్‌ఘడ్, ప్రాంతాలకు రాకపోకలకు ఎంతో సులువు కానుంది. ఒకవేళ ఎయిర్ పోర్టు అనుకూలంగా లేకపోతే రెండో ప్రాధాన్యతగా  భారత వైమానిక శిక్షణ కేంద్రంని ఏర్పాటు చేయాలని విన్నవించారు. 

వైమానిక శిక్షణ కేంద్రం పైనే మొగ్గు

ఆదిలాబాద్‌లో పౌరవిమాన శాఖ ద్వారా విమానాల రాకపోకలు సాగిస్తే ఆశించిన స్థాయిలో ప్రయాణికుల సంఖ్య ఉండే ఆస్కారం లేదని ఇక్కడ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు లేకపోవ డంతో పౌరవిమాన రాకపోకలకు అంతరాయం ఏర్ప డుతుందని ఇటీవల సర్వే నిర్వహించిన ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహకులు తేల్చి చెప్పా రు. ఒకవేళ ఎయిర్‌పోర్టు ఏర్పడకపోతే వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్లు తెలుస్తోంది.

భారత వాయుసేన ఈ మేరకు ఆదిలాబాద్ అన్ని అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అదనంగా 1500 ఎకరాలను సేకరించి వైమానిక శిక్షణ కేం ద్రం (ఎయి ర్ పోర్ట్  ట్రెయినింగ్ సెంటర్) ఏర్పాటు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకోసం రక్షణ శాఖ అత్తమ్ సమగ్ర సర్వే వివరాలతో నివేదిక కోరినట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభు త్వం ఎన్‌ఓసి ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పడితే వేల సంఖ్యలో ఉద్యోగులు ఇక్కడికి రానున్నా రు. వారి కోసం ప్రత్యేక నివాస సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్య క్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మం దికి ఉపాధి అవకాశాలు పెరుగడమే కాకుండా వ్యాపార, వాణిజ్యరీత్యా ఆదిలాబాద్ మార్కెట్ మరింత అభివృద్ధి చెందేం దుకు ఎంతగానో ఆవశ్యకత ఉంది.