18-03-2025 12:00:00 AM
ఎన్నో ఏండ్లుగా ఆదిలాబాద్ జిల్లా వాసుల ఆకాంక్షల మేరకు ఎట్టకేలకు జిల్లా కేంద్రంలో విమానాశ్రయం నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవడం హర్షనీయం. దీనివల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. దేశ, అంతర్జాతీయ నాయకుల పేర్లతో ఎయిర్ పోర్టులు నిర్మిస్తున్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్‌కు గిరిజన యోధుడు కుమ్రం భీం పేరు పెట్టడం సముచితం.
ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్