కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): అనంతపురంలో విమానాశ్రయానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు అవసర మైన సుమారు 12 వందల ఎకరాల భూమిని చూయించాలని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లాకు చెందిన ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి ఇటీవల చేసి న విజ్ఞప్తి మేరకు కేంద్రమంత్రి ఈ విధంగా స్పందించారు.
భూకేటా యింపులు చేస్తే వెంటనే ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అధ్యయనం చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో ఉద్యానపంటలు భారీగా పెరిగిన నేపథ్యం లో విదేశాలకు ఉత్పత్తులను ఎగుమ తి చేసేందుకు, దేశీయంగా రాకపోకలకు అనంతపురంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా వాసులు విమాన సేవల కోసం పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరుపై ఆధారపడుతున్నారు.