పెద్దపల్లి, నవంబర్ 18 (విజయక్రాంతి): ఇప్పటివరకు రామగుండం అంటే మాన్ సిస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుంది. రైల్వే స్టేషన్లలో రామగుండంకు ప్రత్యేక స్థానం ఉంది. ఇకమీదట రామగుండం పేరు దేశ విదేశాలకు కూడా విస్తరించబోతున్నది. రాష్ట్రంలోని కొత్తగూడెం, రామగుండం మండలం బసంత్నగర్లోని విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పచ్చ జెండా లభించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారిక ప్రకటన చేయడం పెద్దపల్లి జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. ఇది అమలుకు నోచుకుంటే ఇక రామగుండం నుంచి రైల్లే కాదు విమానాలు కూడా దేశవ్యాప్తంగా ఎగరనున్నాయి.