దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటింది. ‘ప్రపంచం లో నివాసయోగ్యం కాని నగరం ఏదైనా ఉందా?’ అంటే సమాధానం ‘ఢిల్లీ’ అని చెప్పాలి. గత 8 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ఢిల్లీ, యూపీ, హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో పంటలు తగలబెట్టడం, పరిశ్రమల విష వాయువులు వంటి వాటివల్ల ఈ తీవ్ర విపత్కర దుస్థితి నెలకొంది. ‘పాపం నాది కాదంటే నాది కాదని’ రాష్ట్రాలు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటు న్నారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణి స్తోంది.
వాయు కాలుష్యం స్థాయిలు పెరగడంపై ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ (సీఏక్యూఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్ప టికే పలు ఆంక్షలు విధించగా, తాజాగా మరిన్ని కఠిన నియమాలు అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (జీఆర్‌ఏపీ) కింద మరిన్ని నిబంధనలను సోమవారం నుంచీ అమలు చేయనున్నట్లు తెలిపింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ రాత్రి 7 గంటల సమయానికి 457కి పెరగడం గమనా ర్హం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అక్కడి పాఠశాలల్లో కేవలం ఆన్‌లైన్ తరగతులే నిర్వహించనున్నట్టు సీఎం ఆతిశీ ప్రకటించారు.
ఢిల్లీలో నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా అన్ని ట్రాన్స్‌పోర్ట్ వాహనాల ప్రవేశాన్ని నిలిపివేయాలని సీఏక్యూఎం ఆదేశించింది. ఎల్‌ఎన్జీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులను మాత్ర మే అనుమతించింది. ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమ ర్షియల్ వెహికిల్స్ ప్రవేశంపై నిషేధం. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్నప్పటికీ బీఎస్-4 అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశంపైనా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.
ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 456, అలాగే, రెస్పిరబుల్ పార్టీకులెట్ మ్యాటర్ 525, నైట్రోజన్ డయాక్సైడ్ 36, సల్ఫర్ డయాక్సైడ్ 15, ఓజోన్ 75, కార్బన్ మోనాక్సైడ్ 24గా ఉంది. మరికొద్ది రోజులు సైతం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా వయోజనులు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఢిల్లీసహా పరిసర ప్రాంతాల ప్రజలు గడపదాటి బయటకు రావాలంటే మాస్కులు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది.
చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో పీల్చే గాలి విషంగా మారు తుంది. భవన నిర్మాణ పనుల దుమ్ము, ధూళి కలగలిపి గాలి నాణ్యతను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. పొల్యూషన్ మానిటరింగ్ మెకానిజం లేక మరో ప్రధాన కారణం. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలవుతున్నాయి.
- డా. యం.అఖిలమిత్ర