45వ చెస్ ఒలింపియాడ్
బుడాపెస్ట్ (హంగేరి): 45వ చెస్ ఒలింపియాడ్ పోటీల్లో భారత గ్రాండ్‌మాస్టర్ల హవా కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో జమైకాను ఓడించిన మహిళల బృందం గురువారం రెండో రౌండ్‌లో 3.5 తేడాతో చెక్ రిపబ్లిక్‌కు చెక్ పెట్టింది. రెండో రౌండ్‌కు వైశాలీ దూరం కాగా.. దివ్యా దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, హారిక ద్రోణవల్లి విజయాలు నమోదు చేయగా.. తానియా సచ్‌దేవ్ మాత్రం మార్టినాతో డ్రా చేసుకుంది.
ఇక తొలి రౌండ్‌లో మొరాకోను చిత్తు చేసి ఉత్సాహంగా రెండో రౌండ్‌లో అడుగుపెట్టిన భార త్ 4 ఐస్‌లాండ్ పని పట్టింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి తన జోరును కొనసాగిస్తూ 1 స్టెఫానోస్ హన్నెస్‌పై విజయం సాధించాడు. ప్రజ్ఞానంద స్థానంలో రెండో రౌండ్‌లో బరిలో దిగి న గుకేశ్.. స్టీఫాన్‌సన్‌పై విజయం సాధించాడు. ఇక విదిత్ గుజరాతీ హిల్‌మిర్‌ను చిత్తు చేశాడు. తొలి రౌండ్‌లో పురుషుల బృందం మొరాకోను 4 చిత్తు చేయ గా.. మహిళల బృందం 3.5 తేడాతో జమైకాను చిత్తుగా ఓడించింది. రెండో రౌండ్‌కు ప్రజ్ఞానంద దూరంగాన్నాడు.