calender_icon.png 7 November, 2024 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియన్ అమెరికన్ల హవా

07-11-2024 02:00:53 AM

ప్రతినిధుల సభకు ఆరుగురి ఎన్నిక

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్లు సత్తా చాటారు. ప్రతినిధుల సభ కు ఆరుగురు ఎన్నికయ్యారు. గతంలో ఐదుగురే ఉండగా.. ఈ సారి న్యాయవాది సుహా స్ సుబ్రహ్మణ్యం విజయం సాధించి సంఖ్య ను ఆరుకు పెంచారు.

శ్రీతానేదార్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమిబెరా, ప్రమీలా జయపాల్, సుహాస్ విజయఢంకా మోగించారు. గతంలో ఐదుగా ఉన్న సమోసా కాకస్ (ప్రతినిధుల సభ, సెనెట్‌కు ప్రాతిధ్యం వహించే ఇండియన్ అమెరికన్ల గ్రూప్) లో సభ్యుల సంఖ్య ఈ సారి ఆరుకు పెరిగింది. 

* కాలిఫోర్నియాలోని 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి అమిబెరా ఏడో సారి విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పారు. అమి 2013 నుంచి ఈ స్థానంలో విజయం సాధిస్తూ వస్తున్నారు. 

* ఇక మరో నేత రాజా కృష్ణమూర్తి ఇల్లినోయీ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 

* వాషింగ్టన్‌లోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రమీలా జయపాల్ విజయం దక్కించుకున్నారు. 59 ఏండ్ల ప్రమీల డెమోక్రటిక్‌లో శక్తిమంతమైన నేతగా ఉన్నారు.

* కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రో ఖన్నా విజయం దక్కించుకున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి అనితా చెన్‌పై ఆయ విజయఢంకా మోగించారు. 

* మిషిగన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి శ్రీతానేదార్ విజయం సాధించి.. వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు.

* వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి సుహాస్ సుబ్రహ్మణ్యం డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలుపొందారు.