calender_icon.png 9 November, 2024 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం

19-07-2024 06:53:35 PM

హైదరాబాద్ : బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశా తీరం దాటే అవకాశమున్నదని పేర్కొంది. అనంతరం వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని సూచించింది. వాయుగుండం ప్రభవంతో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో  అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడొచ్చని వెల్లడించింది.