calender_icon.png 23 December, 2024 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

21-12-2024 12:48:52 PM

హైదరాబాద్: చెన్నై నుంచి పూణె వెళ్తున్న ఎయిరిండియా విమానం శనివారం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఆర్‌జిఐఎ) అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు కొద్దిసేపు ఉద్రిక్తతకు గురయ్యారు. చెన్నై నుండి బయలుదేరిన కొద్ది నిమిషాల తర్వాత ఆర్‌జిఐఎలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ప్లైట్  టేక్ ఆఫ్ తర్వాత ప్యూయెల్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

సిబ్బంది ఆర్‌జిఐఎ వద్ద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుండి క్లియరెన్స్ కోరింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ గురించి సిబ్బంది నుండి సమాచారం అందుకున్న తరువాత, విమానాశ్రయ అధికారులు విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి అవసరమైన భద్రతా ప్రోటోకాల్‌లను పాటించారు. ఏటీసీ నుండి సమ్మతి పొందిన తరువాత విమానం ఆర్‌జిఐఎ వద్ద సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు వెల్లడించారు.