calender_icon.png 23 December, 2024 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్ ఎక్స్‌ల్ వెర్టిపోర్ట్స్ కొత్త ఏవియేషన్ ప్రాజెక్టు

20-12-2024 12:59:33 AM

హైదరాబాద్, డిసెంబర్ 19: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తు న్న ఏరోస్పేస్ టెక్నాలజీ కంపెనీ ఎయిర్ ఎక్స్‌ల్ వెర్టిపోర్ట్స్ తన అనుబంధ సంస్థలు, భాగస్వామ్య కంపెనీలతో కలిసి కొత్త ఏవియేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజె క్టు కోసం ఏడబ్ల్యూ 609 టిల్ట్రోటర్ విమానాల్ని రష్యా సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం మిస్స్ అగస్టా వెస్ట్లాండ్ అందిస్తుందని ఎయిర్ ఎక్స్‌ల్ ఒక ప్రకటనలో తెలిపింది.

మరో రష్యా సంస్థ మిస్స్ రోస్కోస్మోస్ (రష్యన్ స్పే స్ ఆక్టివిటీస్) ప్రత్యేకమైన శాటిలైట్లను అం దించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఈ శాటిలైట్లు ప్రత్యేక ఫ్రీక్వెన్సీలను సృష్టించి, టిల్ట్రోటర్ విమానాలు వేర్వేరు మార్గాల్లో,  ఎత్తుల్లో ప్రయాణించేలా చేస్తాయని పేర్కొం ది. ఈ ప్రాజెక్టులో రష్యన్  హెలికాప్టర్లు కూడా పాలుపంచుకుంటాయని,  టిల్ట్రోటర్ విమానాలతో పాటు, ఇవి ప్యాసింజర్లను వేగంగా తరలించడానికి సహాయపడతాయ ని కంపెనీ వివరించింది.  శాశ్వత హెలిపోర్ట్లు/హెలిపాడ్లను మిస్స్ ఎయిర్ ఎక్సెల్టెక్ నిర్మిస్తుందని పేర్కొంది.