11-04-2025 08:04:48 PM
జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెట్రోల్ బంకులు ఎయిర్ చెకింగ్ మిషన్ లు అలంకారప్రాయంగా మారాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బంకులు ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఒక పెట్రోల్ బంకులో కూడా హెయిర్ చెకింగ్ చేసిన దాఖలాలు లేవని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. ప్రస్తుతం ఎండాకాలం అయినందున ఎక్కువగా వాహనాలకు టైరులో నుంచి గాలి తగ్గిపోయి పలు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
ఒక్కొక్క ద్విచక్ర వాహనదారుడు పెట్రోల్ బంకులలో సంవత్సరానికి వేలల్లో పెట్రోల్ పోసుకొని రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పటికీ పెట్రోల్ బంకుల యజమానులకు ఆదాయం కలిగిస్తున్నప్పటికీ ప్రజల సౌకర్యం పట్టించుకోవడం లేదంటూ వాహనదారులు విమర్శిస్తున్నారు. కేవలం జుక్కల్ మండలమే కాకుండా నియోజకవర్గంలోని ఏ మండలంలో కూడా పెట్రోల్ బంకులలో ఏర్ చెకింగ్ చేపట్టడం లేదని కొన్నిచోట్ల మెషిన్లు అలంకారప్రాయంగా ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బంకులను చెకింగ్ చేసే అధికారులు తూతూ మంత్రంగా సందర్శించి మామూలు దండుకొని ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వాహన దారులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రాల్లో లేకపోయినా కనీసం జాతీయ రహదారుల పైన ఉన్న పెట్రోల్ బంక్ లో కూడా ఎయిర్ చెకింగ్ మిషన్లు ఉండి కూడా పనిచేయడం లేదని తెలిపారు. ఎయిర్ మిషిన్లు పెట్రోల్ బంకులలో అలంకారప్రాయంగానే దర్శనం ఇస్తున్నాయి.
బంకు యజమానులు ఎయిర్ మిషన్లు టాయిలెట్లు ఏర్పాటు చేయకుండా అసౌకర్యాలను కల్పిస్తున్నారని పలువురు వాహనదారులు వాపోతున్నారు. కొత్తగా వచ్చిన వాహనదారులు పెట్రోల్ బంకులలో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోతుందని పేర్కొంటున్నారు. బంకుల వద్ద ఉండేది పని చేసే సిబ్బంది మాత్రమే ఉంటారని, యజమానులు లేకపోవడంతో ఎవరిని అడగాలో తెలియడం లేదు అంటూ వాపోతున్నారు. సిబ్బంది మాత్రం తాము ఏమి చేయలేమని యజమానులతో మాట్లాడుకోవాలని సమాధానం ఇస్తున్నారు.
వాహనదారులకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఎవరు వారిని అడగడం లేదని కనీసం ఏర్పాట్లు ఉన్నాయా లేవా అని కూడా పర్యవేక్షణ చేయడం లేదని చెబుతున్నారు. సంబంధిత అధికారులు అమ్మమ్యాలకు ఆశపడి ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళుతుంటారని పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే ప్రతి పెట్రోల్ బంకులలో ఏర్ చెకింగ్ మిషన్లు, టాయిలెట్లు పనిచేసే విధంగా చూడాలని జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.