23-04-2025 12:00:00 AM
బెంగాలీ వ్యక్తి మూత్రపిండాన్ని శరీరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు మార్పు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రి వైద్యులు అసాధారణ శస్త్రచికిత్స చేసి, పశ్చిమబెంగాల్‌కు చెందిన వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. అతడి మూత్రపిండాన్ని శరీరంలో ఒకచోట నుంచి మరోచోటుకు మార్చడంతోపాటు, పూర్తిగా పాడైపోయిన మూత్రనాళం స్థానంలో అపెండిక్స్ ఉపయోగించి అతడి కిడ్నీల పనితీరును సా ధారణ స్థితికి తీసుకొచ్చారు.
సదరు వృద్ధుడికి 2023లో వేరేచోట మూత్రపిండాల్లో రాళ్లు తీయడానికి మామూలు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత అతడి మూత్రనాళాలు పూర్తిగా పూడుకుపోయాయి. దాంతో క్రియాటినైన్ ప్రమాదక రంగా పెరిగిపోయి, విపరీతమైన నొప్పి, తరచూ జ్వరంతో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. కిడ్నీలు రెండూ పాడైపోవడంతో తాత్కాలికంగా అతడికి ట్యూబులు అమర్చి బయటి నుంచి మూత్రం పంపేవారు.
పలు రాష్ట్రాలు తిరిగినా ఏ ఆస్పత్రీ చేర్చుకోకపోవడంతో చివరకు హైదరాబాద్ వచ్చారు. ఏఐఎన్‌యూ వైద్యులు సమ గ్ర పరీక్షలు చేసి, కుడివైపు కిడ్నీ కోసం వైద్యులు ముందుగా అతడి సొంత అపెండిక్స్ తీసుకుని, పూడుకుపోయిన మూత్రనాళానికి బదులు దా న్ని అమర్చారు. అపెండిక్స్ కూడా మూత్రనా ళం పరిమాణంలోనే ఉంటుంది.
ఏఐఎన్‌యూ సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జన్, యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ సమక్షంలో రోబోటిక్ శస్త్రచికిత్సతో దీన్ని మార్చారు. దీన్ని అపెండిక్స్ ఇంటర్పొజిషన్ అంటారు. ఈ చికిత్స అనంతరం అతడి కుడి కిడ్నీ బాగుపడింది. దాంతో బయట అమర్చిన ట్యూబులను తీసేశారు. ఈ సంక్లిష్టమైన చికిత్సలో రోగి ఎడమ కిడ్నీని రక్తనాళాలతో కలిపి తీశారు. తర్వాత దా న్ని కొంత కిందభాగంలో అమర్చారు.
తద్వారా పాడైన మూత్రనాళాన్ని బైపాస్ చేసి, బాగున్న భాగంలోంచి మూత్రం వెళ్లేలా చేశారు. సొంత కిడ్నీ మార్పిడి అనేది చాలా కచ్చితత్వంతో చేయాల్సిన శస్త్రచికిత్స. అతడి శరీరంలోనే అతడి కిడ్నీకి వేరే ఇల్లు ఇచ్చాం అని కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ విజయ్ మద్దూరి తెలిపారు.
ఇప్ప టివరకు ప్రపంచంలో ఇలా చేసినవాటిలో విజయవంతం అయినవే చాలా తక్కువ అని ఏఐ ఎన్యూ ఆస్పత్రి ఎండీ డాక్టర్ సి.మల్లికార్జున తెలిపారు. ఇప్పుడా బెంగాలీ వృద్ధుడు పూర్తి సాధా రణ స్థితికి చేరుకున్నారు. ఈ శస్త్రచికిత్సల్లో డాక్టర్ తైఫ్ బెండెగెరి పాల్గొన్నారు. రెసిడెంట్ వైద్యులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ ఆసిత్ సాయపడ్డారు.