calender_icon.png 10 January, 2025 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ-2 విచారణ 8గంటలు..

10-01-2025 01:41:35 AM

  1. విదేశీ సంస్థకు నిధులు మళ్లించేటప్పుడు రూల్స్ ఎందుకు పాటించలేదు? 
  2. ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌ను విచారించిన ఈడీ

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం బషీర్‌బాగ్ కార్యాలయం లో దాదాపు 8 గంటల పాటు విచారించింది. ఈ మేరకు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న అర్వింద్‌కు మార్ రాత్రి 7.10 గంటలకు కార్యాలయం నుంచి తిరిగి వెళ్లిపోయారు.

ఏసీబీ కేసులో భాగంగా మనీ లాండరింగ్ జరిగిందనే కేసులో ఏ2గా ఉన్న అర్వింద్‌కుమార్‌ను ఈడీ విచారించింది. విదేశీ సంస్థకు నిధులు మళ్లించే సమయంలో కనీసం ఆర్‌బీఐ నిబంధనలు ఎందుకు పాటించలేదు.? ఎవరి ఆదేశాల మేరకు నిధులు మళ్లించారు..? ఎన్నికల కోడ్ ఉండగా..

ఎన్నికల కమిషన్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదు..? అనే అంశాలను విచారణలో అర్వింద్‌కుమార్‌ను ప్రశ్నించి సమాధానాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ను గురువారం ఏసీబీ విచారణకు హాజరు కాగా, ఈ నెల 16వ తేదీన మళ్లీ ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.